రెవ. జి. భాస్కర్

సంఘకాపరి సాక్ష్యం

నేను ఇండియన్ న్యూలైఫ్ ఫెలోషిప్ యొక్క సంఘకాపరి భాస్కర్ రావును.  నేను ఏ స్థితిలో ఉండగ ప్రభునన్ను ఎలా ఆకర్షించారో ? సేవకెలా పిలుచుకున్నారో ? ఇప్పుడెలా వాడుకుంటూన్నారో ? మీతో పంచుకుని దేవుని ఘననామాన్ని మహిమ పరచాలనుకుంటున్నాను.

(దేవున్ని ఎరుగని స్థితి – నాది ఆంధ్రపదేశ్ లోని చిన్నపల్లెటూరు పూండ్ల.  మాది చిన్నకుటుంబం, మా తల్లి దండ్రులకు నేను ఏకైక కుమారుడను. మాకుటుంబికులు ఎవరు కూడా నిజ సత్యదేవున్ని ఎరిగి యుండలేదు.  అంతేగాక మా పూర్వికులనుండి మా తండ్రిగారి వరకు పూర్తిగా విగ్రహారాధికులు. అంతమాత్రమేగాక మా పూర్వజనులు కొలుపులు కొలుచుట, దేవర్ని కొలుచుట, బలులిచ్చుట, బేతాళముగ్గులు వేసి వాటిపై కోళ్ళను బలులిచ్చుట దయ్యాలను వెళ్ళగొట్టుట, మగవాళ్ళు ఆడవేషం వేసుకుని దేవర విగ్రహాన్ని ఎత్తికొనుట అంతేగాక ఏ కులపువారు కొలుపులు కొలిచినను చెప్పినవన్ని తెచ్చి వీరు చెప్పినట్లే చేయాల్సి ఉంటుంది.  మరియు కొలుపుల్లో ఎన్ని గొఱ్ఱెలు (లేక) మేకలు బలికోసం తెచ్చిన వాటిని పొడవాల్సింది కూడా వీరే. బాగా త్రాగి చిందులువేస్తూ ఆ బలులు అర్పించాల్సి ఉంది. మరియు ఆ బలి మాంసము, ఆ పూజకు వచ్చిన పసుపు బియ్యం, అక్కడ కొట్టిన కొబ్బరికాయ అన్ని మా వాళ్ళకే. ఎన్నిరోజులైనా వీటన్నింటిని వీరే ఆరగించాల్సి ఉంటుంది. మాతంగివేషం కూడా వేస్తారు. మరియు డప్పులు వాయిస్తూ ఎగురుట. అంతేగాక తిత్తి ఊదుకుంటూ, గులాలు కొట్టుకుంటూ, డాన్సులువేస్తారు. బుఱ్ఱకథ లేక హరికథల్లాగా దేవీ, దేవర్ల కథలు చెప్తూ కూడా ఉండేవారు. చేతబళ్ళు, మంత్రతంత్రాలు దిష్టి తీయుట, వసీకరణ మంత్రాలు, కుక్క నోరు మంత్రం ద్వారా మూయుట. ఇలాగే మా తండ్రిగారి దాకా జరుగుచూ వచ్చెను. 1960, జనవరి 1 న నేను జన్మించాను.   నా కంటె ముందు ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోవుటవల్ల ఈ దయ్యాలే పిల్లలను చంపాయని నా తల్లి వీటన్నింటిని చెయ్యొద్దు అన్నది.  నేను ఒక్కగాని ఒక్క కుమారుడనగుట వల్ల  నన్ను చాలా గారాబంగా పెంచారు.  ఇంటర్ మీడియట్ వరకు చదివించారు. ఐతే నేను లోకాను సారంగా ఎదిగాను గనుక చదువుకంటే ఎక్కువగా నా ధ్యానం అన్నిరకాల ఆటల్లోను అలాగే సినిమా పాటలు, డాన్సు, మంచిపేరు గాంచిన సినీ యాక్టర్ యొక్క ఇమిటేషన్ చేయుట, వారిలాగే స్టెప్పులు వేయుట, నాటకాలలో వారికి నేర్పుట, ప్లేబాక్ సింగర్ గాను, ఇంకా సిగరెట్స్ మరియు మధ్యపానం సేవించుట, అల్లరి చిల్లరగా తిరుగుట.  స్కూల్ తరపున డిస్ట్రిక్ లెవెల్ కబడ్డీ ఆడాను, కాలేజిలో బెస్ట్ విలన్ అవార్డ్ తీసుకున్నాను. ఇలా చేస్తూ చదువును ముందుకు కొనసాగించలేదు.  ఇలాగున గడుస్తుండగా నా తల్లి అనారోగ్యపాలయ్యి పూర్తిగా నడవలేని స్థితిలో ఉంది.  ఆ టైమ్ లో మా ఇల్లు గడచుటకూడా కష్టమాయే కాని దేవుని కృపయేంటంటే  ఆదినాల్లోనే నాకు ఢిల్లీ పోలీస్ గా జాబ్ వచ్చింది.  అదే సంవత్సరం మా బంధువుల అమ్మాయితో పెండ్లయినది – అది 18.06.1986. ఇక అప్పటినుండి ఢిల్లీలోనే ఉంటున్నాము.  మాకు ఇద్దరు పాపలు పుట్టారు. ఐతే ఆంథ్రాలోనే లోకానుసారంగా జీవిస్తున్ననేను ఢిల్లీ పోలీసయ్యాక ఇంకా రోజూ త్రాగడం, రాత్రిళ్ళు 2 గంటలకు ఇంటికి రావడం, ఏ పార్టీలు, ఫంక్షన్స్ జరిగినా అన్నీ చోట్లా నేను ముఖ్యాంగా ఉండేవాడిని. కారణం అందరి యాక్టర్స్ లాగా స్టెప్ డాన్సులు, వారిలాంటి స్వరాలతో జనాన్ని అలరింపచేస్తూ ఉండేవాడిని.  ఐతే నా భార్య చిన్ననాటినుండి చర్చ్ కెళ్లుట, బైబిల్ చదువుట ప్రార్థనలకని మీటింగ్స్ కని వేరే ఊళ్ళుకూడా వెళ్ళ్తూఉండేది కాని నా వద్దకొచ్చాక అన్నీ మానేసి ఇంటివరకే పరిమితి అయ్యి 24 గంటలూ టి.వి., సినిమాలు చూస్తూ దేవున్ని పూర్తిగా మరచిపోయింది.  నాకు అన్నివిధాలసహకరిస్తూ ఉంది.  ఇలా దేవుడు లేకుండా మా జీవితం సాగుతుంది.

(బిమారుమనస్సు పొందుటకు అనుకూలించిన పరిస్థితులు

నా భార్యకు ఒక బాబాయి ఉన్నాడు అతనిపేరు యేసు పాదం. అతను నేను బాల్య స్నేహితులం. ఐతే అతనికి పెండ్లయి 10 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. డాక్టర్స్ భార్యా భర్తలిద్దరికీ టెష్టులు, ఆపరేషన్ చేసి, మందులు వాడి కూడ ఇద్దరికి పిల్లలు కలుగరని చెప్పారు. చివరకు ఒక పాపను పెంచుకున్నారు.  తీరా చూస్తే ఆమెకు పుట్టుకతోనే మూగ, చెముడు. ఒక రోజు అనగా 4 సంవత్సరాలు వయస్సు వచ్చాక. నాలుగు సంవత్సరాల క్రితం గడువెళ్ళిన ఒక ఐరన్ బిళ్ళల డబ్బా దొరికి,  తిని హాస్పిటల్ పాలయ్యింది. డాక్టర్స్ వైధ్యం చేసి పాపను సృహలోనికి తెచ్చి ప్రాణభయం లేదన్నారు. కనుక ఇతను ఇంటికెళ్ళి నామకార్థ క్రైస్తవుడు కనుక  కళ్ళు మూసికొని బైబిల్ తెరువగ (యెషయా 42: 13)  పాప చనిపోతుందని వచ్చె. తరువాత నీ ప్రాకారాన్ని పునాదులతో సహా పడగొడతానన్న వాక్యం కనబడింది. దాన్ని చదివి అనగా నా పాప బాగుందని డాక్టర్ చెబితే బైబిల్ అంటుంది చనిపోతాదని. ఇది ఎలా నిజమని నమ్మలేదు.  మరలా హాస్పిటల్ కి వెళ్లేటప్పటికి ఆ పాప చనిపోయింది.  ఇక తన మైండ్ లో ఒక వైపు డాక్టర్ మాటలు రెండో వైపు దేవుని మాటలు. ట్యాలీ చేసుకొని పిల్ల బ్రతికిందని డాక్టర్స్ ,  కాదు చనిపోతుందని బైబిల్ చెప్తే (దేవుని) వాక్యమే నెరవేరింది.  ఐతే మాకు పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పారు. కాని బైబిల్ గర్భఫలం యెహొవా ఇచ్చు బహుమానమని (కీర్తన 127:3) పుట్టించు వాడనైన నేను గర్భమును మూసెదనా (యెషయా 66: 9) ? అని దేవుడు చెప్తుండె.  అంటే మాకు సంతానం కలిగే విషయంలో కూడా దేవుని మాటే నెరవేరుతుందని నమ్మి అప్పటికప్పుడు పశ్ఛాత్తాపంతో దేవున్ని నమ్మి, మరలా సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి నా భార్య గర్భవతి కావాలని రోజుకి 8 గంటలు ప్రార్థన చేయమొదలు పెట్టెను.  ఇలాగుండగా నిజంగా దేవుని మహాకృపనుబట్టి అతని భార్య సంవత్సరం తిరుగకుండా గర్భవతి ఆయెను.  అలాగున దేవుడు తనకు అసాధ్యమైనది లేదని డాక్టర్స్ కి వ్యతిరేకంగా తన నామాన్ని మహిమపరచినందుకు దేవునికి స్తోత్రములు. మరియు ఆడపిల్లే కావాలని 9 నెలలు ఉపవాసముండి ప్రార్థించగా కాన్పుకు ముందే కుమార్తెలు చంకనెత్తబడుచున్నారని దేవుడు మాట్లాడె – అలాగే జరిగెను.  ఆ తరువాత కూడా నలుగురు కుమార్తెలు కలిగిరి. అంతేగాక దేవుడు తనకి స్వస్థత వరమిచ్చి ప్రతివిధమైన రోగాలను స్వస్థపరుస్తూ, దుష్టాత్మలను తరుముతూ దేవుడు తనతో ఉండెను.

ఐతే అతను నా స్నేహితుడగుట వలన నేను ఎలాంటివాడినో ఎరిగి ఉన్నాడు.  గనుక నాకు మారుమనస్సు అవసరమని లేకుంటే నరకమని మమ్ములను ప్రేమించి మేమూ ప్రభుని నమ్ముకోవాలని, ఈ పై విషయాలన్ని తెలుపుతూ ఎప్పటిప్పుడు ఉత్తరాలు రాసేవాడు. నేను చేసిన దానిని బట్టి నాకు కలిగే దేవుని క్రోదం గూర్చి తప్పించుకోవాలని, మారుమనస్సు పొంది, దేవుని రాకడకై ఎదురు చూడమని తన కుమార్తెకు ఉత్తరాలు రాసేవాడు.  అయినా మేము దేవున్నే ప్రథంగా ఎన్నుకోలేకపోయాము. కాని ఒక సారి నా భార్య ఆంథ్రా వెళ్ళినప్పుడు చనిపోయె పరిస్థితిలో అతని చేత ప్రార్థన చేయించుకోగా యేసునామంలో వెంటనే స్వస్థత కలిగెను. ఐతే నా భార్యకు ఈ స్వస్థత రక్షణ (దేవుని) వైపు మళ్ళించెను.  అదెలాగనగా – ఇంత శీఘ్రంగా ప్రార్థన ఆలకించి స్వస్థపరిచాడు అంటే దీని వెనుక సత్యం ఏంటంటే బ్రతికి ఉన్నవారే  వినగలుగుతారుయేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు గనుకే వెంటనే ఆలకించె. బ్రతికించాడు అంటే నిజంగా దేవుడు ఈయనే. ఐతే చనిపోయింది ఎందుకు?   మనుష్యులందరూ పాపులు గనుక పాప విమోచనకై రక్తం కార్చి, పరిశుద్థులుగా చేసి, నరకం నుండి తప్పించాలనే గదా ?  ఐతే నేను యేసుక్రీసుని పూర్తిగా అంగీకరించకపోతే చనిపోయి నరకానికి వెళ్తానా ? ఇక్కడ చిన్న నొప్పే తట్టుకోలేని మనం యుగయుగాలుండే నరకంలో ఎలా ఉండ గలుగుతాం. ఐతే యేసుని అంగీకరించాల్సిందేస్వస్థత కలిగందంటే స్వర్గం నరకం కూడా ఖచ్చితంగా ఉందనే కదా ! మనిషి చనిపోక తప్పదు.క్రీస్తులేకుంటే నరకం తప్పదని దేవుని నమ్ముకోవాలని పూర్తి ప్రయత్నాలు చేసి విఫలమై చివరికి, వాళ్ళ బాబాయ్ కూడ ఒక ముల్లును బట్టి దేవున్ని ఎరుగగలిగాడు.  అందుకని తనకు ఒక ముల్లు అవసరమని, కనీసం ఈ రీతిగానైనా దేవునిలోనే స్ధిరపడగలుగుతానని, ఐతే భర్తకో, బిడ్డలకో లేక ఇంకెవరికో ఏ బాధవచ్చిన అది – ఇంత మార్పు తేలేదేమో. కనుక తనకే ఏ భయంకరమైన భాధో వస్తే మారతానేమోనని, మామూలు రోగాలొస్తే అలవాటు ప్రకారం డాక్టర్ల వద్ద కెళ్తే తగ్గుతుంది.  కాని తగ్గని రోగం అయితే చావు వచ్చే వరకైన ఈ ముల్లువల్ల దేవునిలో స్థిరంగా ఉండగలుగుతానని,  క్యాన్సర్ అయితే బాగుండని ప్రార్థిస్తూ ఉండేది.  ఐతే కొన్నాళ్ళకు కడుపులో బహు భయంకరమైన నొప్పివస్తూఉంది. అలవాటు ప్రకారం ఆంథ్రాలోను, ఢిల్లీలోను చూపించి మందులు వాడినా తగ్గక అది ఎక్కువ అవుతూ రాగా డాక్టర్స్ సలహా మేరకు అల్ట్రా సౌండ్ చేయిస్తే, గర్భసంచికి కుడివైపున సిస్ట్ అని అది 3.5 సెంటీమీటర్లు ఉందని ఇది కేవలం ఆపరేషన్ వల్ల తప్ప మందుల ద్వారా పోదని, ఇప్పుడయితే 4 లేక 5 కుట్లే పడతాయని, ఆలస్యం చేస్తే 4,5 సంవత్సరాలకే ఎప్పటికి మంచంలో ఉండిపోయి చివరికి గర్భసంచి, రెండు వైపులా ఉన్న ట్యూబులు తీసి 35 కుట్లు పడే ఆపరేషన్ అవుతుంది అని చెప్పారు. ఇక నా భార్య ఇది దేవుడు నా ప్రార్థన విని నా కిచ్చిన ముల్లు కనుక నేను ఆపరేషన్ చేయించుకోను. దేవుడు నన్ను ప్రేమించే కేన్సర్ గాక సిస్ట్ ఇచ్చాడని దేవునికి స్తోత్రాలు చెల్లించి, ఆ రోజునుంచి పాపాలొప్పుకుని ప్రతి సమయం ప్రార్థనలోను, బైబిల్ చదువుటలో గడుపుతూఉంటే, నేను చాలా కోపగించుకుని, తిట్టి, నీవు చస్తావు ఎందుకు ఆపరేషన్ చేయించుకోవు అని అడుగగా, పెండ్లయి 10 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టరని నిర్థారించిన డాక్టర్స్ ని కూడ  ఫేల్ చేసి దేవుడు బాబాయిని సంతాన వంతులుగా చేయలేదా ? దేవుని చిత్తమయితే నా గడ్డకూడా తీసివేస్తారు. తీయకున్నా ఫరవాలేదు. నేను మాత్రం దేవునిలో స్థిరపడతా నరకంను తప్పించుకుంటానని చెప్పింది. నాకు బాగా కోపం వచ్చి దేవుడు లేడు, ఉన్నా !  రోగాలు తగ్గించే దేవుడు లేడు. అని అరచినా ఆమె గట్టినమ్మకంతో నా మాటలు లక్ష్యపెట్టలేదు.  నీ కెలా తగ్గిస్తాడో దేవుడు చూస్తానన్నాను.  అప్పటినుంచి ఆమె పిల్లలతో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంది.  నేనేమో నా కుమార్తె లిద్దరిని సినిమా యాక్టర్స్ చేయాలని డాన్సు నేర్పటం, ఉదయాన్నే పార్కుకు తీసుకెళ్ళి వ్యాయామం చేయించేవాడిని. ఐతే నా మనస్సులో ఈమె చనిపోతే మాకెవరూ లేరే, పిల్లలిద్దర్ని ఎలా పెంచాలి. నా పరిస్థితి ఏంటి అని చాలా చింతగా ఉన్న కాని బయట పడక మదన పడుతూ ఉన్నా.  తను మాత్రం చాలా సంతోషంగా ఉంది.  కొన్నిరోజుల తరువాత నొప్పి వస్తుందా అని అడిగితే, ఆశ్చర్యమైన సమాధానం చెప్పింది.  అసలు రాలేదని.  నాకు నమ్మబుద్ది వేయలా. కాని ఒక రోజు ఒంటరిగా బైబిల్ తెరిచా,  ఏ వాక్యం వస్తుందా,  నా భార్యకేమౌతుందా అని. అప్పుడు కీర్తనలు 118:18 ఆయన నన్ను కఠినంగా శిక్షించెను గాని మరణానికి అప్పచెప్పలేదు. నేను అవాక్కయ్యి మరలా మరలా వాక్యం తీస్తే అదే వచ్చింది.  అప్పుడు నాకు అర్ధమయినదేంటంటే నా భార్యకు దీనివల్ల ఏమీ కాదు. ఇది మేము మారుమనస్సు పొందుటకే వచ్చిందని గ్రహించి. నేనూ ఆనాటినుంచి వీళ్ళతోపాటు ప్రార్థనలో కూర్చోటం, వారితో కలసి చర్చ్ కెళ్ళటం మొదలేశాను.  నేను అప్పటికీ బాగా త్రాగుతూ తమ్మాకు ఇలాంటి కిళ్ళీలన్ని తింటూవున్న. ఇష్టానుసారంగానే జీవిస్తూనే ఉన్నా. కాని వాక్యం విని చదువుట ద్వారా పాపాలు ఒప్పుకుని క్షమాపణ కోరి లోకంలోని అలవాట్లన్ని మానాలని, ఇలా అన్ని వదలుకుంటే నాకు కలిగే లాభం ఏంటా అని ఆలోచిస్తే దేవుడు మత్తయి 19:27,28 వాక్యం చూపించి దేవుని రాజ్యంలో ఉంటావని చెప్పెను.  ఇద్దరం కలసి 1994 నవంబర్ 19 న బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభువులో తిరిగి జన్మించాము.

సిసేవా భారం కలిగించి దేవుడు పిలుచుకున్న విధానం :

ఇలాగున నేను బైబిల్ పూర్తిగా చదివి దీన్నిబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసముంచమని ఇతరులకు చెప్తే, మన దేశ గ్రంథాలను నమ్మేవారికి నేనెలా సమాధానం చెప్పాలి? వారిక నరకానికి వెళ్ళాల్సిందేనా? అని భారంతో ప్రార్థిస్తే.  దేవుడు నాకు దర్శనంలో 2 ధెస్స 5 : 21 చదవ మనగా లేచి చూస్తే సమస్తంను గ్రహించి మేలైన దాన్ని చేపట్టు అనెను. అప్పుడు దేవుడు నా దృష్టికి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చె అవేమనగా దేవుళ్ళు అనబడుతున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తుకి గల తేడాలు. అప్పుడా పుస్తకాలన్ని తెప్పించి గ్రంథాల్లో ఉన్నది కూడా పాప విమోచకుడంటే యేసుక్రీస్తేనని, కన్యగర్భాన పశువులపాకలో పుడతాడని, సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ అవసరమని, అది యేసులోనే జరిగిందని, పాపాల కోసం చనిపోయి మృత్యుంజయుడయినది కూడా యేసేనని, పున్నామి నరకం నుండి తప్పించేది కూడా పాపులమయిన మనుషులకు పుట్టిన కుమారుడు గాక, దేవుని కుమారుడన బడే యేసుక్రీస్తే నని, ఇలా ఇంకా ఎన్నో విషయాలద్వారా అన్ని గ్రంథాల్లో కూడా యేసుని గూర్చిన వివరణే ఉందని సంపూర్ణంగా గ్రహించాను. ఐతే ఈ సత్యంను అందరికి చెప్పాలన్న ఆశ నాలో మొదలాయె. కనబడిన ప్రతి ఒక్కరికి వాళ్ళు పేదలైనా ధనికులైనా, లేక గుళ్ళల్లో పూజారులైనా అందరికి యేసుక్రీస్తుని గూర్చి చెప్తూ వారు సత్యాన్ని గ్రహించగా వారికి దగ్గరలో నున్న ఏదో ఒక సంఘానికి వెళ్ళమని పంపుతూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక సిస్టర్ తో నేను విగ్రహాలలో దేవుడు లేడనే సత్యంను తెలిపి క్రీస్తులో బలపరచి ఒక సంఘానికి పంపితే, వారు బాప్తీస్మం ఇచ్చి ఆ సందర్భాన దిల్ వాలా దుల్హనియా లే జాయేంగే అనే సినిమా వేసుకున్న కారణాన ఆమె చర్చ్ మాని వేశానని చెప్తే, నేను చాలా కృంగిపోయాను. ఇలా ఎందుకు మరలా పాపం వైపు మళ్ళించబడుతున్నారు అని. నేనెందరికి సువార్త చెప్పానో వారందరిని గూర్చి ప్రార్థన చేస్తూ ఉన్న.  ఒక రోజు ఒకరింటికి అనుకోకుండా వెళ్తే అక్కడ ప్రార్థన కొచ్చిన దైవజనుడు నన్నెరుగడు, నేనూ అతన్ని ఎరుగను. అయినా ప్రభుని ఆత్మ అతనిపై కొచ్చి నా గురించి ప్రభుని చిత్తమేదో అది ప్రవచించారు.  అదేమనగా నా ద్వారా రాబోవు దినాల్లో సంఘం కడతాడని, అద్భుతంగా వాడుకుంటారని, నా శరీరంమంతా వాక్యాలున్నవని ఆకాశం నుండి ప్రకాశమైన వెలుగువచ్చి వెలుగు నుండి బైబిళ్ళు నా పై కుమ్మరించ బడుతున్నాయని, అంతేగాక ఇవి జరగకుండా చేయాలని సాతాను 10 రోజుల తరువాత యాక్సిడెంట్ ద్వారా దెబ్బతీయాలని చూస్తున్నాడని చెప్పాడు. ఐతే దేవుడు తన పనికి నేనర్హుడనైతే నన్ను ఆయనే బ్రతికించుకుంటాడని విశ్వాసంతో ప్రార్థనచేస్తూ ఉన్నాము. అలాగే 10 రోజుల తరువాత పెద్ద యాక్సిండెంటయినది. దేవుడు మమ్మును కాపాడాడు.  ఐతే నేను ఒక దైవ జనుడిగా అర్హుడను కానని దేవునితో అంటే, ఆయన నాకు దర్శనం ద్వారా ఒక దైవజనుడు అందహీనంగా ఉన్నా కూడ.  దేవుడు వాడుకుంటూ వారిచేతిలోని బైబిల్ నాకిచ్చి నన్ను వేలమందికి ప్రసంగించమని చూపించగా. దైర్యం వచ్చింది. కాని సాహసించకలేక పోయాను. ఇంకా మరొకసారి పెద్ద మీటింగ్ కి వెల్తే అక్కడ దైవజనులు 3 లక్షల మందిలో నన్ను పేరు పెట్టి పిలిచి ఢిల్లీ సేవకై అభిషేకిస్తున్నామని ప్రార్థించిరి. ఆ తరువాత దేవుడు నాకు స్వస్థత వరాన్ని కూడా ఇచ్చాడు. అదెలాగనగా నాతండ్రి అనుకోకుండా పక్షవాతంతో పడిపోయి నోటి మాటకూడా లేకుండా కాళ్ళు చేతులు వంకర్లు కూడా పోగా నేను నా భార్య ప్రార్థించగా దేవుడు ఆయన్ను 20 నిమిషాలకే సంపూర్ణంగా బాగుచేసారు. ఆ రాత్రే ప్రభువు నా కలలో కానా అనే ఊరు చూపి యేసుక్రీస్తు ప్రభువు కానా అనే ఊరి పెండ్లి విందులో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి మొట్టమొదటి అధ్బుతకార్యం చేశారు. అలానే నీ జీవితంలో కూడా ఇది మొట్ట మొదటి కార్యమని చెప్పారు. ఇక అప్పటినుండి అనేక అద్భుతాలు లెక్కలేనన్ని చేస్తూ ముందు మా గృహంలోను తరువాత ఒక దర్శనం ద్వారా అదేమనగా వెండి పళ్ళెంలో బంగారు యాపిల్ నేరుగా నాహృదయంలోకి జొచ్చుట. వెంటనే ఒక గొఱ్ఱె పిల్ల నా కాళ్ళ చుట్టూ తిరుగుచుండగా ఆకాశంనుండి ఒక స్వరం నీ వద్దకు వచ్చిన వారినందరిని నీ వారనుకుని ప్రార్ధించిన నేను నీ ప్రార్థనవిని వారిని బాగుచేస్తాననెను. అలానే ప్రభువు అనేక స్వస్థలు, అద్భుతాలు జరిగించె. అది క్యాన్సరయినా, ఎయిడ్స్ అయిన పిల్లలు పుట్టకపోయినా, ఇక సాధారణంగా వచ్చే ప్రతి విధమైన రోగమయినా దేవుడు బాగుచేస్తూ వస్తున్నాడు.  ఆయన వాగ్ధానాన్ని నెరవేర్చుకున్న దేవునికే మహిమ కలుగును గాక. ఇలా జరిగాక కొన్నాళ్ళకు 1997 జనవరి 18కి దేవుడు నన్ను ప్రత్యేక సంఘంగా నిలబెట్టాడు. దీనికి పేరు కూడా ఇండియన్ న్యూలైఫ్ ఫెలోషిప్ అని ప్రభువే తన స్వరం ద్వారా చెప్పారు. రోమా 6:4. సంఘం ప్రత్యేకంగా ఏర్పడిన దగ్గర నుంచి అనేక ప్రాంతాలకెళ్ళి క్రీస్తుని తెలియపరచుటకు అలానే చాలా మందిని నూతనంగా ప్రభువులోకి తెచ్చి బాప్తిస్మం ఇచ్చులాగున కృపచూపెను. అతిముఖ్యంగా అల్పవిశ్వాసులను, క్రమం-లేని వారిని  క్రమంలోకి నడిపించుటకును, స్ధిరంగా ప్రభువులో బలపరచుటలోను దేవుడు సహాయం చేసెను.  ఇంకా సేవను బలపరచుటకు పత్రిక (సువార్త విస్పోటకము) నడుపుటకు, ట్రాక్స్ పంచుటకు  సహాయపడెను. కంప్యూటర్, లాప్ టాప్ ఇచ్చెను. మరిముఖ్యంగా ఢిల్లీలాంటి మహాపట్టణంలో 2004 లో చర్చ్ కై స్థలం కొనుటకు, 2007 లో చర్చ్ కట్టుటకు కృప చూపెను. అలానే ప్రభు ప్రేరణను బట్టి 2009 నుండి ప్రకటన గ్రంథము యొక్క క్యాలండర్ తీయుటకు తోడ్పడెను. 2009 లో చర్చ్ కై ఒకమారుతీ వ్యాను ఇచ్చెను. వీటన్నింటీ కంటే ముఖ్యంగా ప్రభువు నన్ను ఉద్యోగం చేసుకుంటూ పౌలులాగా సేవ చేయ మనెను. ఇప్పటి వరకు ప్రభుప్రేమలో ఇలానే కొనసాగుతున్నాను. ఏ గొప్పలకు, ఏ మెప్పులకు ఏ ప్రలోభాలకు లోబడకుండా, పరిశుద్దాత్ముడు మా వెంటనుండి వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఢిల్లిలో 3 స్థలాల్లో ఆరాథన జరుపుటకు వాడుకుంటున్నాడు. అంతేగాక వెబ్ సైడ్ ద్వారా కూడా సువార్త అందించే అనుగ్రహం చూపెను – దేవునికి స్తోత్రం.

సువార్త విస్ఫోటము

త్రిత్వము

ప్రకృతిలో ఏలాగు త్రిత్వమున్నదో అలాగే దేవునిలో త్రిత్వమున్నది. అంటే ప్రకృతి నుండి దేవుడు కలిగాడు అని కాదుగాని, దేవుడు త్రిత్వమైఉన్నా డుగనుకనే దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతి విషయంలో త్రిత్వం చూడగలుగుతున్నాము . ఇప్పుడు మనము త్రిత్వం కలిగిన కొన్ని చూద్దాం.

1. సూర్యుడు:- ఎండ, వేడిమి, సూర్యరశ్మి.

2. పదార్థములోఘన, ద్రవ, వాయువు

3: గ్రుడ్డు లో : పెంకు, తెల్లసొన, పచ్చసొన 

4: నరునిలోశరీరం, ప్రాణం, ఆత్మ

5: శరీరంలో : కండరములు, ఎముకలు, రక్తం

6: ఆత్మ లోమనస్సాక్షి, ఆరాధన, అంతర్జ్ఞానం

7:ప్రాణం(జీవం): ఆలోచించడానికి తెలివి, ఎవరిని ఏవిధంగా ప్రేమించాలోనన్న వివేకం, ఏదైనా చేయుటకు చిత్తశుద్ధి.

ఇలాగే దేవునిలో కూడా త్రిత్వం చూడగలంతండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు ఒక్కడే కాని ఆయన తన పని జరిగించుటకు ఏర్పరుచుకున్న సమయాలు, కాలాలలో పని చేసిన విధానాన్ని బట్టి వారి వారి గుణగణాలను బట్టి దేవుని పరిశుద్ధత వెల్లడైనది. అదేదనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కొందరు అనుకుంటున్నట్లు ముగ్గురు దేవుళ్ళనుకొనుట తప్పు. సూర్యుడు కూడా ముగ్గురు కాదు, అలానే గుడ్డు కూడాను. ముఖ్యంగా మనిషిలో కూడా మూడు చూశాము. కాని ఒక దాని నుండి ఒకటి వేరు చేస్తే మనిషే ఉండడు. అలాగే దేవుణ్ణి మూడు విధాలుగా గమనించినంతమాత్రాన దేవుళ్ళు ముగ్గురు కాలేరు. మనం గమనించినవన్ని త్రిత్వం కలిగినవిగా ఉండి ఏలాగు ఒకటిగా ఉన్నవో అలాగే దేవుడు కూడా త్రిత్వం కలిగి ఏకైక దేవుడుగా ఉన్నాడు. ఈయనే సృష్టికర్త. మనుష్యులను, జంతువులను, పక్షులను, నేలప్రాకు పురుగులను, సముద్రములను, చెట్లను, భూమిని, ఆకాశములను,సూర్య, చంద్ర, నక్షత్రాలను, గ్రహాలను, జలములను, అందలి జలచరాలను, భూమిలోఉన్న పెట్రోలు, డీజలు, కిరోసిన్, వెండి, బంగారం, ఇత్తడి, రాగి, ఇనుము, బొగ్గు లాంటి ఖనిజ సంపదలన్ని ఆయన సృష్టించాడు.

రక్షణ మరియు స్వస్థత వైద్యశాల

నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగును (మార్కు-16:17)

ప్రియులారా మన జీవితంలో చాల రకాల సమస్యలు వస్తుంటాయి. జీవితం చాలా దుఃఖకరంగా కనిపిస్తుంది. కాని మనకు ఎదురయ్యే సమస్యలు అనేక రకాలైతే, వాటిలో అతిముఖ్యమైన సమస్య అనారోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటే  ఎన్ని సమస్యలైనా ఎదుర్కొన గలిగిన ధైర్యం, ఆలోచన, నిరీక్షణ కలుగుతాయి. అదే గనుక అనారోగ్యం ఉన్నట్లయితే ఇంకా మనకు ఎదురయ్యే ఇతర సమస్యలను బట్టి మానసికంగా కృంగిపోయి ఏమీ చేయలేక ఇంకా రోగం పెరిగి కృశించి పోయి చనిపోతాము. కనుక మన జీవితంలో ఎటూ సమస్యలు తప్పవు వాటిని ఎదుర్కొనాలంటే ఆరోగ్యం చాలా అవసరం. ఐతే మనం అనుకోవచ్చు! అందుకు  మందులు, హాస్పటల్స్ ఉన్నవి కదా అని. కాని వాటివల్ల కూడా దినాల్లో గ్యారంటీ లేదు. సరైన డాక్టర్స్ కూడా లేరు. పైగా మనం వాడే మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. హాస్పిటల్ లో టెస్టులూ, టెస్టులని ఇంకా రోగ లక్షణాలు పెరిగి ప్రాణం కుడా అలసిపోతూ ఉంటుంది. మన జీవితంలో సగం మన అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకునే ప్రయత్నంతోనే సరిపోతుంది. ఐతే అనారోగ్య సమస్యకు పరిష్కారం ఏంటా అని మీరనుకోవచ్చు. అది చాలా సుళువైన  పరిష్కారం. అది నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను. కేవలం అనారోగ్యం  నుండే గాక ఇతర సమస్యల నుండి కూడా మనలను బయట పెడుతుంది . ఇటీవలే ఒక రెండు నెలల బాబుకి అనారోగ్యం అయి మెడ వంకర్లు పోయి, నోటి నుండి నురుగొచ్చి, కళ్ళు తేలేస్తుండగా, ప్రార్థన చేయమని దైవదాసుని వేడుకుంటే వారు ఏసుక్రీస్తు నామంలో సర్వసృష్టికర్తయైన దేవుని ప్రార్ధించగా, బాబు వెంటనే మామూలుగా అయ్యాడు . ఇప్పుడు ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. అలానే ఇంకొక 5 సంవత్సరాల పాపకు కడుపు నొప్పి అయ్యి వారం నుండి బాధపడుతుంది . మందులు వాడినా తగ్గలేదు. కాని అన్ని సమస్యలు తీసివేయగలిగిన ఏసునామంలో ప్రార్ధించి దైవదాసులు ఇచ్చిన నీళ్ళు త్రాగిస్తే పాపకు అనారోగ్యం కుదుట పడెను. ఇలాగు అనేక కార్యాలు జరిగాయి. అది ఎయిడ్స్ అయినా, కేన్సర్ అయినా, ఇంకా దినాల్లో వచ్చే రోగమైనా, దేవుడు యేసునామంలో ప్రార్ధించిన వారి ప్రార్ధన విని బాగుచేస్తున్నాడు. ఆపరేషన్ జరగాల్సిన విషయాల్లో కూడా యేసునందు విస్వాసముంచితే ఆపరేషన్ లేకుండా దేవుడు గడ్డలయినా, పుండ్లయినా, మరి ఏదైనా బాగు చేసి బ్రతికించాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎందుకంటే బైబిల్ నందు అనగా 2012 సంవత్సరాల సమయంలో ఏసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు తన వద్దకు వచ్చిన రకరకాల రోగులందరిని చూచి కనికరించి బాగుచేసెను. అంతేకాక ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు గనుక అప్పటి నుంచి ఆయనపై విశ్వాసముంచి, నమ్మి, ప్రార్ధించిన వారందరూ మేలులు పొందుకున్నారు. కనుక మేమునూ మా జీవితంలో అనేకములు, అనగా లెక్కకు మించిన అద్భుత కార్యములు చూశాము. పిల్లలు లేనివారికి పిల్లలను కూడా ఇచ్చాడు దేవుడు . మానసిక చింత అయినా లేక పిల్లల చదువుల విషయమైనా దేవుడు సహాయం చేస్తాడు. కనుక మీ అవసరం ఏదైనా అది అనారోగ్యమైనా, నిరుద్యోగమైనా, పిల్లలు లేకున్నా, కుటుంబ సమస్యలైనా, మరి ఇంకేదైనా మేము మీ గురించి మీ సమస్యలు తొలగాలని ప్రార్ధించగలము. కనుక మీరు మమ్మును సంప్రదించండి. అందుకు అనుకూలంగా ప్రతి నెలా 2 శనివారం ఆయనగర్ లోని జి-49, ఫేస్-6 నందు స్వస్థత కూటమి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. కనుక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నాం. దేవుడు మీ ప్రతి ఒక్క అవసరత మన  ప్రభువునూ, రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో తీర్చును గాక. అంతేగాక మీరు ఇంకా తెలుసుకో కోరిన ఎడల ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1.00 గంట వరకు జరిగే ఆరాధన లో పాల్గొని మీ జీవితాల్లో మేలులు పొందుకోగలరు. మీ కోసం దైవదాసులు వచ్చి మీ అవసరతల దొరకై ప్రార్ధించగలరు. ఆమేన్ …………………….